Telugu News » Spirit: ప్రభాస్‌కు జోడీగా నేషనల్ క్రష్.. ప్లాన్ చేస్తున్న ‘యానిమల్’ డైరెక్టర్..!

Spirit: ప్రభాస్‌కు జోడీగా నేషనల్ క్రష్.. ప్లాన్ చేస్తున్న ‘యానిమల్’ డైరెక్టర్..!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

by Mano
Spirit: 'Animal' director who is planning a national crush with Prabhas..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(National crush Rashmika Mandanna) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఏ ముహూర్తాన ‘పుష్ప’ సినిమా(Pushpa Movie)లో హీరోయిన్‌గా సెలక్ట్ అయిందో కానీ.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప మూవీ తర్వాత నిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

Spirit: 'Animal' director who is planning a national crush with Prabhas..!

చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మికకు.. యానిమల్ సినిమా మరింత బూస్ట్‌ ఇచ్చింది. గీతాంజలి పాత్రలో తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది రష్మిక. అయితే, ఈ బ్యూటీ ఖాతాలో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Young Rebel Star Prabhas) సరనస రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. గతంలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఇంకా పట్టాలెక్కలేదు. ఇక స్పిరిట్ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. రష్మికను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట సందీప్ వంగ. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా చూపించిన సందీప్ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్‌ను ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్.. పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. అదేవిధంగా త్వరలోనే యానిమల్ పార్క్ పట్టాలెక్కనుంది. ఇందులోనూ రష్మిక కనిపించనుంది.

You may also like

Leave a Comment