శేఖర్ కమ్ముల-ధనుష్(Shekhar Kammula-Dhanush) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను తిరుమల(Tirumala)లో చేపట్టారు. కొన్ని సన్నివేశాలను నిత్యం రద్దీగా ఉండే అలిపిరి(Alipiri) వద్ద తీస్తున్నారు. దీంతో తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
షూటింగ్ కారణంగా కపిల్ తీర్థం ద్వారా తిరుమలకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను దారి మళ్లించారు. ఇందుకోసం పోలీసులతో పాటు బౌన్సర్లను మోహరించారు. అదేవిధంగా ఇరుకుగా ఉండే హరేరామ హరేకృష్ణ రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు మూవీ టీం తగిన అనుమతులు తీసుకుంది.
ఈరోజు(మంగళవారం) ఉదయం 6గంటల నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ రేపు(బుధవారం) మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల వరకు షూటింగ్‌కు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దని, పోలీసు బందోబస్తుకు అనుమతులు ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. అయినా నిబంధనలు ఉల్లంఘించి మంగళవారం ఉదయం నుంచి అలిపిరి వద్ద షూటింగ్ చేస్తూ భక్తులకు ఆంక్షలు చెబుతున్నారు.
హీరో సిబ్బంది, బౌన్సర్లు భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్మీషన్ ఇవ్వడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు.
కాగా, శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో రానున్న ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.