Telugu News » Urvashi Rautela: 24 క్యారెట్ల గోల్డెన్ కేక్ కట్ చేసి.. గ్రాండ్‌గా ఊర్వశి రౌతేలా బర్త్ డే..!!

Urvashi Rautela: 24 క్యారెట్ల గోల్డెన్ కేక్ కట్ చేసి.. గ్రాండ్‌గా ఊర్వశి రౌతేలా బర్త్ డే..!!

నేడు(ఫిబ్రవరి 25న) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గోల్డెన్ కేక్ కట్ చేసి అభిమానులను షాక్ అండ్ సర్ప్రైజ్ చేసింది.

by Mano
Urvashi Rautela: Cut a 24 carat golden cake.. Urvashi Rautela's birthday in a grand way..!!

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘ బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిందులేసి టాలీవుడ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకుంది. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’, రామ్ పోతినేని ‘స్కంద’, పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’, సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో తన అందాలతో, డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంది.

Urvashi Rautela: Cut a 24 carat golden cake.. Urvashi Rautela's birthday in a grand way..!!

అయితే, నేడు(ఫిబ్రవరి 25న) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గోల్డెన్ కేక్ కట్ చేసి అభిమానులను షాక్ అండ్ సర్ప్రైజ్ చేసింది. ఏకంగా 24 క్యారెట్ గోల్డెన్ కేక్ కట్ చేసి ఫొటోలను పోస్ట్ చేసింది. బాలీవుడ్ ఫేమస్ సింగర్, ర్యాపర్ హనీ సింగ్‌ను ఉద్దేశించి పోస్ట్ రాసుకొచ్చింది ఊర్వశి.

ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ “లవ్ డోస్ 2 సెట్లో 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేశాను. సెట్లో నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసినందుకు ధన్యవాదాలు. నా పట్ల మీరు చూపించిన నిజమైన శ్రద్ధ నా కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది” అంటూ ఊర్వశి రాసుకొచ్చింది.

ఇప్పటి వరకు హనీ సింగ్ రూపొందించిన కొన్ని మ్యూజిక్ వీడియోల్లో ఊర్వశి రౌటేలా సందడి చేసింది. ఏకంగా 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

You may also like

Leave a Comment