విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్క(Anushka) దంపతులకు రెండో సంతానం కలిగింది. ఈనెల 15వ తేదీన అనుష్కా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. తమ కుమారుడికి అకాయ్(Akay) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు.
విరుష్క దంపతులు 2021లో ఆ జంటకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు వామిక అని నామకరణం చేశారు. అయితే ఇద్దరు పిల్లల పేర్లు కొత్తగా ఉండగా ఆ పేర్లకు అసలు అర్థం ఏంటో చాలామందికి తెలియదు. అకాయ్ అనే పేరుకు టర్కిష్ భాషలో ఓ అర్థం ఉన్నది. మెరిసే చంద్రుడిని అకాయ్ అని ఆ భాషలో పిలుస్తారు.
అదేవిధంగా హిందీ పదం కాయ అన్న పదం నుంచి అకాయ్ వచ్చినట్లు భావిస్తున్నారు. కాయ్ అంటే కాయం. అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే పుష్టికరమైన శరీరం కలవాడని అర్థం వస్తుందని కొందరు భాషా నిపుణులు భావిస్తున్నారు. ఇక మొదటి కుమార్తె ‘వామిక’ పేరుకు అర్థం దుర్గాదేవి. శివుడిలో సగభాగమైన పార్వతీదేవి మరోపేరు వామిక.
తాజాగా కోహ్లీ చేసిన పోస్టు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే విరాట్ కోహ్లీ చేసిన పోస్టుకు 50 లక్షల లైక్‌లు వచ్చేశాయి. విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కావడంతో అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కోహ్లీకి వెల్‌కమ్ చెబుతున్నారు. ఇక ఇటీవల సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.