Telugu News » Vivek Agnihotri: ‘ఎయిర్ ఇండియా’పై స్టార్ డైరెక్టర్ ఆగ్రహం..!

Vivek Agnihotri: ‘ఎయిర్ ఇండియా’పై స్టార్ డైరెక్టర్ ఆగ్రహం..!

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డాడు. విమానం గంటన్నరకుపైగా ఆలస్యం కావడంతో తాను ఇబ్బందులకు గురయ్యారని తెలిపాడు. అంతేకాదు.. విమానంలో మరుగుదొడ్లు కూడా శుభ్రంగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

by Mano
Vivek Agnihotri: Star director angry with 'Air India'..!

‘ది కశ్మీర్ ఫైల్స్'(The kashmir Files) చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన సృష్టించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ డైరెక్టర్ బాలీవుడ్‌ తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈ సారి విమాన ప్రయాణంలో కలిగిన అసౌకర్యంపై అసహనం వ్యక్తం చేశాడు.

Vivek Agnihotri: Star director angry with 'Air India'..!

ఈ డైరెక్టర్ తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డాడు. విమానం గంటన్నరకుపైగా ఆలస్యం కావడంతో తాను ఇబ్బందులకు గురయ్యారని తెలిపాడు. అంతేకాదు.. విమానంలో మరుగుదొడ్లు కూడా శుభ్రంగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

తాను ఉదయం 11.10 గంటలకు విమానం ఎక్కానని, మధ్యాహ్నం 12.40 గంటలకు వరకు విమానంలోనే ఉండిపోయానని చెప్పాడు. దాదాపు దాదాపు 1.30 గంటలు విమానం ఆలస్యమైనా క్రూ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆలస్యమవుతూ ఉన్నాయని, ఇండిగోలో ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

విమానం ఎందుకు ఆలస్యం అయిందో తెలుసుకునే మార్గం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. లేటెస్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్ దేని కోసం అంటూ ప్రశ్నించారు. దిక్కుతోచని సిబ్బందితో పాటు ప్రయాణికులను ఏసీ టన్నెల్లో ఎందుకు బంధించారంటూ ఆయన మండిపడ్డారు.

ఇండిగోలో చాలా అరుదుగా ప్రయాణిస్తుంటానని విమానయాన సంస్థలు, సిబ్బంది ఉదాసీనంగా, అహంకారంతో ప్రవర్తిస్తున్నాయని ఆయన అన్నారు. విమానాలు 30 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఛార్జీలో కొంత వాపస్ చేయకూడదా అంటూ ఎయిర్ లైన్స్ వారిని వివేక్ అగ్నిహోత్రి ప్రశ్నించారు.

You may also like

Leave a Comment