Telugu News » Pawan Kalyan: భార్యతో కలిసి పవన్ కల్యాణ్‌ ఇటలీ టూర్.. ఫోటోలు వైరల్..!

Pawan Kalyan: భార్యతో కలిసి పవన్ కల్యాణ్‌ ఇటలీ టూర్.. ఫోటోలు వైరల్..!

హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు (Varun Tej-Lavanya Thripathi) మరో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట నవంబర్ 1న పెళ్లి చేసుకోనుంది.

by Mano

హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు (Varun Tej-Lavanya Thripathi) మరో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట నవంబర్ 1న పెళ్లి చేసుకోనుంది. అయితే వీరి పెళ్లి ఇటలీలోని టుస్కానీ విలేజ్‌లో చేసుకోనున్నారు. ఈ వేడుక నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా ఇటలీకి చేరుకుంటున్నారు.

Pawan Kalyan: Pawan Kalyan's Italy tour with his wife.. Photos are viral..!

ఈ నేపథ్యంలో రీసెంట్‌గా వరుణ్‌-లావణ్యలతో పాటు నిహారిక ఇటలీ బయల్దేరిన వీడియోలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌ తన భార్య అన్నాతో కలిసి ఇటలీకి బయల్దేరాడు. వీరిద్దరూ శంషాబాద్‌ ఏయిర్‌పోర్ట్‌లో తీసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ను, తన భార్య అన్నాతో కలిసి చూడటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక పెళ్లి తంతులో భాగంగా అక్టోబర్‌ 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1న వివాహం పూర్తయిన తర్వాత నవంబర్‌ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ వైభవంగా నిర్వహించనున్నారు.

ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. ఇంతకాలం గోప్యంగా ఉంచినా కుటుంబసభ్యుల అంగీకారం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

You may also like

Leave a Comment