Telugu News » Trisha Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషకు క్షమాపణలు చెప్పిన విలన్..!

Trisha Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషకు క్షమాపణలు చెప్పిన విలన్..!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హీరోయిన్ త్రిష గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan)ఎట్టకేలకు శుక్రవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు.

by Mano
Trisha Mansoor Ali Khan: The villain who apologized to heroine Trisha..!

హీరోయిన్ త్రిష(Trisha)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు, ‘లియో’ సినిమా విలన్ మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan)ఎట్టకేలకు శుక్రవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హీరోయిన్ త్రిష గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Trisha Mansoor Ali Khan: The villain who apologized to heroine Trisha..!

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నటి త్రిషకు మద్దతుగా ఆగ్ర నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు పోస్టులు పెట్టారు. జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డీజీపీకి మన్సూర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై చెన్నై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా మన్సూర్ అలీ మాట్లాడుతూ.. ‘మన్సూర్ నిత్యవసర ధరల పెరుగుదల సమస్య కూడా ప్రజలకు గుర్తు చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందని, ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందని ఊహించలేదని అన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు.. అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

అదేవిధంగా ‘నేను వారం పాటు కత్తి లేకుండానే యుద్ధం చేశా. రక్తపాతం లేకుండానే గెలిచాను. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. ఇక్కడ నేను అహింసా మార్గం వైపు నిలబడ్డాను’ అంటూ పేర్కొన్నాడు. అయితే మన్సూర్ క్షమాపణలు కోరిన విధానంపైనా ప్రస్తుతం నెట్టింట వివాదాస్పదమవుతోంది.

You may also like

Leave a Comment