బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi rautela) అహ్మదాబాద్(Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మధ్య జరిగిన ప్రపంచకప్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో తన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ వాపోయింది ఈ బ్యూటీ. ఫోన్‌ను తిరిగి ఇచ్చిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి ఊర్వశి ఈ మెయిల్‌కు మెసేజ్ చేశాడు.
‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి పంపిన ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆమె అందులో చూపింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాను పోగొట్టుకున్న ఐఫోన్ అలాంటి ఇలాంటి ఫోన్ కాదని.. అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని ఊర్వశి ఆ మధ్య ట్వీట్ చేసి వెల్లడించింది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడని కామెంట్ చేశారు.
ఈ మేరకు ఈ బ్యూటీ ఓ వ్యక్తి పంపిన మెయిల్‌ను షేర్ చేసుకుంది. ఆమె పోగొట్టుకున్న ఆమెవద్దకు చేరుకుంటుందో లేదో తెలియదు కానీ పోయిన ఐ ఫోన్ ఊర్వశికి తెగ పాపురాటీని తెచ్చిపెట్టింది. మొత్తానికి ఈ ఫోన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. ఊర్వశి సినిమాల విషయానికి వస్తే సౌత్‌తో వరుస ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.