Telugu News » Anupama Hot look : అందమా అనుపమా.?! వైరల్ అవుతున్న గ్లామర్ పిక్స్..!!

Anupama Hot look : అందమా అనుపమా.?! వైరల్ అవుతున్న గ్లామర్ పిక్స్..!!

తెలుగులో ప్రేమమ్ సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).

by sai krishna

తెలుగులో ప్రేమమ్ సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). కోలకళ్ల అందాలతో కుర్రాళ్లను కైపులో ముంచేసిన ఈ చిన్నది త్రివిక్రమ్ ‘అ..ఆ..’ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న సెకండ్ హీరోయిన్ పాత్రలోనూ భలేగా మెప్పించింది.


తాజాగా హాట్ లుక్స్(Hot looks)తో ఉన్న ఫొటోలతో ఫిల్మీ లవర్స్ కి కనువిందు చేస్తోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ భామకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ మధ్య కాలంలో హీరోయిన్ రేస్ లో కాస్త వెనుకబడ్డా కార్తికేయా 2 (Karthikeya-2)ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. హీరో నిఖిల్(Nikhil) తోనే చేసిన 18 పేజెస్ అనే లవ్ ఎంటర్‌టైనర్‌ కూడా బాగానే ఆకట్టుకుంది. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ ‘టిల్లూ స్వ్కేవర్’ కోసం కొత్త లుక్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


ఈ చిత్రంలో కొత్త అనుపమను చూస్తారంటూ ట్వీట్ కూడా చేసింది. తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకో ఏమో ‘పద..పద’ అనే ఆల్బన్ సాంగ్ కూడా చేసింది. డెన్నిస్ నార్టన్ కంపోజ్ చేసి, చిన్మయి చేసిన ఈ పాట అంతా జపాన్(Japan)లోని టోక్యో (Tokyo) లో చిత్రీకరించారు. అందమైన జపనీ సీతాకోకచిలుకలా అనుపమా ఇందులో కనిపించి మురిపించింది.

You may also like

Leave a Comment