Telugu News » Gunturu Karam: ‘గుంటూరు కారం’ సినిమాపై బాలీవుడ్ బాద్‌షా ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Gunturu Karam: ‘గుంటూరు కారం’ సినిమాపై బాలీవుడ్ బాద్‌షా ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star MaheshBabu) నటించిన తాజా చిత్రం గుంటూరు కారం(Gunturu Karam). ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

by Mano
Gunturu Karam: Bollywood Badshah's interesting tweet on the movie 'Gunturu Karam'..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star MaheshBabu) నటించిన తాజా చిత్రం గుంటూరు కారం(Gunturu Karam). మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్(Director Trivikram) తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

Gunturu Karam: Bollywood Badshah's interesting tweet on the movie 'Gunturu Karam'..!

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయితే, మొదటి రోజు ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.94కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘గుంటూరు కారం కోసం ఎదురుచూస్తున్నాను. నా స్నేహితుడు మహేష్ యాక్షన్ అండ్ మాస్ రైడ్ ఇది.’ అంటూ గుంటూరు కారం ట్రైలర్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ట్వీట్ నెట్టింట బాగా వైరలవుతోంది.

షారుఖ్ ట్వీట్‌తో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో షారుక్‌ నటించిన జవాన్ సినిమాపై మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

You may also like

Leave a Comment