Telugu News » Janhvi Kapoor: ‘డబ్బు కోసం ఏమైనా చేస్తావా..?’  జాన్వీకపూర్‌పై నెట్టింట ట్రోల్స్..!

Janhvi Kapoor: ‘డబ్బు కోసం ఏమైనా చేస్తావా..?’  జాన్వీకపూర్‌పై నెట్టింట ట్రోల్స్..!

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ‘దేవర’(Devara)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో జాన్వీపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

by Mano
Janhvi Kapoor: 'Would you do anything for money..?' Trolls on Janhvi Kapoor..!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఎన్టీఆర్ ‘దేవర’(Devara)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో జాన్వీపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor: 'Would you do anything for money..?' Trolls on Janhvi Kapoor..!

అసలు విషయానికి వస్తే.. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో దాదాపు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. ప్రపంచ నలుమూలల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఫ్యామిలీతో పాటు వెళ్లింది.

అక్కడ రాధిక మర్చంట్ పెళ్లి కూతురిగా ముస్తాబై నడుస్తూ ఉండగా పక్కనే కొందరు ఆమెపై పువ్వులు చల్లుతూ హారతులు పట్టారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్‌ కూడా ఏకంగా పళ్లెం పట్టుకొని పెళ్లి కూతురుకు హారతి ఇస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు.

డబ్బు కోసం ఏమైనా చేస్తావా? అంటూ కొందరంటుంటే.. మరికొంతమంది మాత్రం అందులో తప్పేముందని ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇక, జాన్వీ దేవర షూటింగ్‌లో బిజీగా మారింది. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న విడుదల కానుంది. రూ.300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

You may also like

Leave a Comment