Telugu News » Mrunal Thakur: ‘సీతారామం’ బ్యూటీకి బంపరాఫర్..!

Mrunal Thakur: ‘సీతారామం’ బ్యూటీకి బంపరాఫర్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ కథానాయకుడిగా, దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో హిరోయిన్​గా మృణాల్​ ఠాకూర్​ను తీసుకోనున్నట్లు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

by Mano
Mrunal Thakur: Bumperafar for the beauty of 'Sitaramam'..!

సీతారామం(Seetharamam) సినిమాతో ఓవర్​ నైట్ స్టార్​ స్టేటస్​ అందుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల భామ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. అలా బాలీవుడ్​లోనూ బాగానే సినిమాలు చేస్తోంది.

Mrunal Thakur: Bumperafar for the beauty of 'Sitaramam'..!

అంతేకాకుండా కోలీవుడ్​లోనూ మృణాల్​కు అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్​ నాన్న’లో నటించి మరో సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్​లో మరో బంపర్​ ఆఫర్​ కొట్టేసినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ కథానాయకుడిగా, దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో హిరోయిన్​గా మృణాల్​ ఠాకూర్​ను తీసుకోనున్నట్లు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. హనురాఘవపూడి-ప్రభాస్​ కాంబినేషల్​లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్​ను ఫైనలైజ్​ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు టాక్​ నడుస్తోంది.

స్క్రిప్ట్​ ఫైనలైజ్​ అయితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ పట్టాలపైకి వెళ్లే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్​ అశ్విన్​ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి-2898ఏడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. దీంతోపాటు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. అటు యానిమల్ డైరెక్టర్ సందీప్​ వంగతో ‘స్పిరిట్‌’ చేస్తున్నాడు.

You may also like

Leave a Comment