Telugu News » Tapsee: హీరోయిన్ తాప్సీ పెళ్లి వీడియో లీక్.. నెట్టింట వైరల్..!

Tapsee: హీరోయిన్ తాప్సీ పెళ్లి వీడియో లీక్.. నెట్టింట వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసి బాలీవుడ్ బాట పట్టిన హీరోయిన్ తాప్సీ(Tapsee) ఇటీవల రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

by Mano
Tapsee: Heroine Tapsee's wedding video leaked.. Going viral..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసి బాలీవుడ్ బాట పట్టిన హీరోయిన్ తాప్సీ(Tapsee) ఇటీవల రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడు మథియాస్‌బో తో వివాహం చేసుకుందని, మార్చి 20న వీరి ప్రీవెడ్డింగ్ వేడుక జరిగిందని సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. అంతేకాదు.. వీరి వివాహం(Wedding) మార్చి 23వ తేదీన ఉదయ్‌పూర్‌లో జరిగింది.

Tapsee: Heroine Tapsee's wedding video leaked.. Going viral..!

తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక ఇటీవల కొన్ని ఫొటోలు షేర్ చేసి వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తర్వాత జరిగిన హోలీ వేడుకల్లో తాప్సీ సింధూరం పెట్టుకొని కనిపించారు. అయితే ఇంతవరకు తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అధికారికంగా బయటపెట్టలేదు. ఈక్రమంలో తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లిలో తాప్సీ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. వరుడు మథియాస్ సింపుల్ డ్రెస్‌లో స్వాగతం పలికారు. ఇద్దరూ దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. పదేళ్లు రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది.

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, అవేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో బాలీవుడ్‌ బాట పట్టింది. ఇప్పుడు అక్కడ మంచి విజయాలు అందుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

You may also like

Leave a Comment