Telugu News » Urvashi rautela: ఊర్వశికి ఊహించని షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్!

Urvashi rautela: ఊర్వశికి ఊహించని షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్!

తాజాగా ఓ వ్యక్తి ఊర్వశి ఈ మెయిల్‌కు మెసేజ్ చేశాడు. ఆ వ్యక్తి పంపిన ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఆమె అందులో చూపింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

by Mano
Urvashi rautela: Unexpected shock for Urvashi.. The person who hit the phone is in condition!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi rautela) అహ్మదాబాద్‌(Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మధ్య జరిగిన ప్రపంచకప్‌ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో తన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ వాపోయింది ఈ బ్యూటీ. ఫోన్‌ను తిరిగి ఇచ్చిన వారికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి ఊర్వశి ఈ మెయిల్‌కు మెసేజ్ చేశాడు.

Urvashi rautela: Unexpected shock for Urvashi.. The person who hit the phone is in condition!

‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వ్యక్తి పంపిన ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఆమె అందులో చూపింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాను పోగొట్టుకున్న ఐఫోన్ అలాంటి ఇలాంటి ఫోన్ కాదని.. అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని ఊర్వశి ఆ మధ్య ట్వీట్ చేసి వెల్లడించింది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడని కామెంట్ చేశారు.

ఈ మేరకు ఈ బ్యూటీ ఓ వ్యక్తి పంపిన మెయిల్‌ను షేర్ చేసుకుంది. ఆమె పోగొట్టుకున్న ఆమెవద్దకు చేరుకుంటుందో లేదో తెలియదు కానీ పోయిన ఐ ఫోన్ ఊర్వశికి తెగ పాపురాటీని తెచ్చిపెట్టింది. మొత్తానికి ఈ ఫోన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. ఊర్వశి సినిమాల విషయానికి వస్తే సౌత్‌తో వరుస ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

You may also like

Leave a Comment