Telugu News » Vijay Devarakonda: ‘నిన్ను చూసి గర్వపడుతున్నా..’ రష్మిక‌కు విజయ్ దేవరకొండ విషెస్..!

Vijay Devarakonda: ‘నిన్ను చూసి గర్వపడుతున్నా..’ రష్మిక‌కు విజయ్ దేవరకొండ విషెస్..!

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు చోటు దక్కడంపై రౌడీబాయ్ విజయ్ దేవరకొండ విషెస్ తెలిపాడు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు.

by Mano
Vijay Devarakonda: 'I'm proud of you..' Vijay Devarakonda wishes for Rashmika..!

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’(Forbes India Magazine ’30 Under 30′) జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) చోటుదక్కించుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

Vijay Devarakonda: 'I'm proud of you..' Vijay Devarakonda wishes for Rashmika..!

‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్. ఫ్యాన్స్‌ కూడా రష్మికపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ఫోర్బ్స్ పత్రిక.. ‘30 అండర్ 30’ జాబితాను రూపొందిస్తుంది.

ఈ ఏడాది రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్‌లకు ఈ లిస్టులో చోటుదక్కింది. ఈ గుర్తింపుపై రష్మిక సోషల్  మీడియా వేదికగా స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్టును విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు.

Vijay Devarakonda: 'I'm proud of you..' Vijay Devarakonda wishes for Rashmika..!

 

కాగా, రష్మిక, విజయ్‌ దేవరకొండ కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ ఉంటుందని వార్తలు వెలువడటంతో అలాంటిదేమీ లేదని ఇటీవలే రష్మిక క్లారిటీ ఇచ్చింది. ప్రతీ రెండేళ్లకు ఓసారి మీడియాలో తన పెళ్లి గురించి, ఏడాదికోసారి ఎంగేజ్‌మెంట్ వార్తలు వస్తుంటాయని వ్యాఖ్యానించింది.

 

You may also like

Leave a Comment