Telugu News » Hanuman Movie: రూ.100కోట్ల క్లబ్‌లోకి ‘హనుమాన్’..!

Hanuman Movie: రూ.100కోట్ల క్లబ్‌లోకి ‘హనుమాన్’..!

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు.

by Mano
Hanuman Movie: 'Hanuman' enters Rs.100 crore club..!

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు.

Hanuman Movie: 'Hanuman' enters Rs.100 crore club..!

నాలుగో రోజు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ రూ.24కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ సాధించింది. తాజాగా ఈ చిత్రం సలార్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. అటు హనుమాన్ సినిమాకు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఉత్తరాదిలో ఇప్పటివరకు రూ.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అటు అమెరికాలోనూ హనుమాన్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అమెరికాలో మొదటి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సలార్, బాహుబలి రికార్డ్స్ దాటేసింది హనుమాన్.

రోజురోజుకు హనుమాన్ సినిమాకు మరింత ఆదరణ లభిస్తోంది. ఇక నార్త్‌లో ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. విడుదలై నాలుగు రోజులు దాటుతున్నా థియేటర్లు మాత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. తక్కువ థియేటర్లలో విడుదలై ఇప్పుడు వాటి సంఖ్య పెంచుకుంటోంది.

ఈ సినిమాలో అమృతా అయ్యార్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందే ప్రీమియర్స్‏తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లతో దూసుకుపోతోంది.

You may also like

Leave a Comment