బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై కాంగ్రెస్ పార్టీ ఎక్స్(X) వేదికగా సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘జాతర రామారావు..’ అనే ట్యాగ్ లైన్‌తో ‘జాతకం తారుమారయ్యాకా మొత్తానికి జాతకాలు చెప్పుకు బతుకుతున్నావన్న మాట..’ ‘ఎలాగూ సోది చెప్పడం అలవాటే కదా.. కానీ!!’’ అని కేటీఆర్ ఫొటోను ట్యాగ్ చేసింది.
‘రాజకీయ నిరుద్యోగిగా మారడంతో జాతకాలు చెప్పే డ్యూటీలో చిన్న దొర ఎక్కినట్లున్నాడు. పెద్ద దొర ఐదారు నెలల తర్వాత సర్కారు ఉండదు అంటాడు. ఇగ ఈయనేమో కాంగ్రెస్‌ను బొంద పెడతామంటాడు.’ ఎంత మీకు బీజేపీతో స్నేహం ఉంటే మాత్రం అంత పబ్లిక్ గా ఇలా ఎలా మాట్లాడతారు. మాకేం బీజేపీ ఉంది. ప్రభుత్వాలు కూల్చడం, పార్టీలు చీల్చడంలో వాళ్లు దిట్ట.’ అని పేర్కొంది.
‘అయ్యా కొడుకులు దోపిడీకి సిద్ధమవుదామని అనుకుంటున్నారా? కేటీఆర్ మీ దొంగ కలలు నేరవేరవు.. గత ఎన్నికల్లో మీరు, మీ బీజేపి కలిసి వ్యవస్థలన్నింటిని మేనేజ్ చేసి సంఘటితంగా మమ్మల్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తే, ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాయకుడు పని చేయాలి. కానీ మాటలతో పబ్బం గడిపి అప్పుడు తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇప్పుడు అధికారం పోయాక ఇలా సోది చెప్తూ ఆగం చెయ్యాలని చూస్తుండ్రు.’
‘సోది ముచ్చట్లు ఆపితే ఆ కాస్తైనా గౌరవం నిలుపుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే మా నేత చెప్పనే చెప్పిండు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అన్న లాగుల్లా ఏం ఇడుస్తమన్నరో మీకు యాదికి ఉందనే నమ్ముతున్నాం. జర భద్రం…!!’ అని టీ కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది.
రాజకీయ నిరుద్యోగిగా మారినాక జాతకాలు చెప్పే డ్యూటీ లో ఎక్కినట్టున్నడు చిన్న దొర. పెద్ద దొరనేమో ఐదారు నెలల తర్వాత సర్కారు ఉండదు అంటాడు, ఇగ ఈయనేమో కాంగ్రెస్ ను బొంద పెడతాడు అంటాడు. ఎంత మీకు బీజేపి తో స్నేహం ఉంటే మాత్రం అంత పబ్లిక్ గా ఇలా ఎలా మాట్లాడతారు. మాకేం మా బీజేపి ఉంది.… https://t.co/0g54AF7Ln1 pic.twitter.com/hHkVBaWKo8
— Telangana Congress (@INCTelangana) March 6, 2024