బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) భార్య ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్గా వెలిగిపోయిన ఆమె పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలతోనే పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. అదేవిధంగా అక్షయ్ సినిమాలకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
అయితే, 50ఏళ్ల ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్ డిగ్రీ(Mastar Degree) పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఇందుకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘50ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టా పొందారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై ఆనందంగా ఉంది.. చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా.’’ అని అక్షయ్ పేర్కొన్నాడు.
అదేవిధంగా ‘‘ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూనే విద్యనభ్యసించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్” అంటూ అక్షయ్‌కుమార్ ఎమోషనల్ అయ్యాడు.
ట్వింకిల్ ఖన్నా పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్యాగ్ చేశారు.. ఈ పోస్ట్‌పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.. అక్షయ్ పోస్ట్‌పై తాజాగా స్పందించిన ఆమె.. ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం” అని అన్నారు.
Two years ago when you told me you wanted to take up studies all over again, I wondered if you meant it. But the day I saw you work so hard and perfectly manage a full-fledged student life along with home, career, me and kids, I knew I had married a super woman. Today on your… pic.twitter.com/smHAHNlTWd
— Akshay Kumar (@akshaykumar) January 16, 2024